Advertisement

  • తండ్రి పేరు మీద స్కూల్ కట్టిస్తున్న స్టార్ డైరెక్టర్

తండ్రి పేరు మీద స్కూల్ కట్టిస్తున్న స్టార్ డైరెక్టర్

By: Sankar Mon, 03 Aug 2020 10:53 AM

తండ్రి పేరు మీద స్కూల్ కట్టిస్తున్న స్టార్ డైరెక్టర్



లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌గా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సినిమాల‌తోనే కాక సేవా కార్య‌క్ర‌మాల ద్వారాను ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంటూ ఉంటారు. రీసెంట్‌గా త‌న తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు పేరు మీద మట్టపర్రు గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు అంతస్తుల పాఠశాల భవనం నిర్మాణం చేయాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు.

భ‌వ‌నం ఖ‌ర్చు దాదాపు 14 ల‌క్ష‌ల రూపాయాలు అవుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఆ ఖ‌ర్చంతా సుకుమార్ భ‌రిస్తాన‌ని చెప్పార‌ట‌. తన పెద్ద‌న్న‌య్య శ్రీ బండ్రెడ్డి వెంకటేశ్వర రావు పాఠ‌శాల భ‌వనానికి శంకుస్థాప‌న చేశారు. వీలైనంత త్వ‌ర‌గా పాఠ‌శాల భ‌వ‌నం పూర్తి చేయాల‌ని సుకుమార్ భావిస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం సినిమాతో బంపర్ హిట్ కొట్టిన సుకుమార్ ప్ర‌స్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొంద‌నున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల అయి అభిమానులను ఆకట్టుకుంది ..తొలిసారిగా తన స్టైలిష్ స్టార్ ఇమేజ్ ను పక్కకు పెట్టి అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తున్నారు ..దీనితో సినిమా మీద బారి అంచనాలు ఉన్నాయి

Tags :
|

Advertisement