Advertisement

  • మరో కొత్త సినిమా ను ప్రకటించిన స్టార్ డైరెక్టర్

మరో కొత్త సినిమా ను ప్రకటించిన స్టార్ డైరెక్టర్

By: chandrasekar Thu, 17 Dec 2020 10:20 PM

మరో కొత్త సినిమా ను ప్రకటించిన స్టార్ డైరెక్టర్


స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా తీసి మంచి గుర్తింపు పొందారు.ఈ సినిమా దేశవ్యాప్తంగా బాగా హిట్ కావడంతోదీనికి సెకండ్ పార్ట్ గా కే జి ఎఫ్ చాప్టర్-2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు.ఈయన మన టాలీవుడ్ ప్రముఖ హీరో ప్రభాస్ తో 'సలార్' అనే సినిమాను చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.దీంతో పాటు ఇప్పుడు మరో చిత్రాన్ని ప్రకటించారు.ప్రస్తుతం ఈ సినిమా పేరును 'Bhagheera' గా ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు శ్రీ మురళి హీరోగా నటించనున్నట్లు తెలిపారు.ప్రభాస్ నటించబోయే సలార్ సినిమాను నిర్మించబోయే సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు.కే జి ఎఫ్ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం అభిమానులంతా కే జి ఎఫ్ చాప్టర్-2 కోసం భారీగానే ఎదురుచూస్తున్నారు.కన్నడ హీరో శ్రీ మురళి ప్రస్తుతం 'మద గజ రాజా' సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ కొత్త గా నిర్మించబడే భగీరథ సినిమా షూటింగ్ లోపాల్గొననున్నట్లు తెలిపారు.

Tags :
|

Advertisement