Advertisement

ఆసుపత్రిలో స్టెప్పులు వేసిన రెమో డిసౌజా

By: Sankar Mon, 14 Dec 2020 10:00 PM

ఆసుపత్రిలో స్టెప్పులు వేసిన రెమో డిసౌజా


ప్ర‌ముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ రెమో డిసౌజా గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. అభిమానులు, సినీ ప్ర‌ముఖులు రెమో కోలుకుని క్షేమంగా తిరిగిరావాల‌ని ప్రార్థించారు.

ఆస్ప‌త్రిలో చేరిన త‌ర్వాత తొలిసారి తీసిన ఓ వీడియోను రెమో స‌తీమ‌ణి లిజెల్లే డిసౌజా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రెమో స్లైలిష్ హిపాప్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తుంటే కాళ్ల‌ను వీడియో తీసింది లిజెల్లే.

కాళ్ల‌తో డ్యాన్స్ చేయ‌డం ఒక‌టైతే..హృద‌యంతో డ్యాన్స్ చేయ‌డం మరొక‌టి..రెమో డిసౌజా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించిన వారికి ధ‌న్య‌వాదాలు అని క్యాప్ష‌న్ ఇచ్చింది లిజెల్లే డిసౌజా. ఇక త‌మ అభిమాన డ్యాన్స‌ర్ కోలుకుని ఇలా స్టెప్పులేస్తుండ‌టంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు రెమో ఫాలోవ‌ర్లు.

Tags :

Advertisement