Advertisement

  • బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ యాంకర్

బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ యాంకర్

By: Sankar Sun, 08 Nov 2020 2:14 PM

బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ యాంకర్


తెలుగులో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్4 రోజు రోజుకు రసవత్తరంగా సాగుకేగుతుంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్లు , కంటెస్టెంట్స్ మధ్య గొడవలు , కంటెస్టెంట్స్ మద్యం ప్రేమలు షో పైన ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక 9వ వారంలోకి ఎంటరైన బిగ్ బాస్ షో నామినేషన్స్ హీటెక్కాయి.

ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టే ఎలిమినేషన్ వుంటుందని శనివారం మరోసారి నాగార్జున చెప్పారు. అభిజిత్ ముందుగా అమ్మ రాజశేఖర్ మాస్టర్ ని ఆరిపోయే దీపం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బుట్ట బరువెక్కాలి అనే సింపథీ గేమ్ లో మోనాల్ కి అఖిల్ మినహా ఎవరూ సపోర్ట్ చేయకపోవడంతో అవినాష్ కే లాస్య.. మెహబూబ్.. సోహైల్.. అరియానా సపోర్ట్ చేయడంతో వచ్చే వారం ఎలిమినేట్ కాకుండా తప్పించుకున్నాడు. ఇక ఈ వారం నామినేషన్ లో వున్న సభ్యులు అభిజిత్- మోనాల్ - అమ్మ రాజశేఖర్- అవినాష్ లు వున్నారు.

అవినాష్.. అరియానా తప్ప అంతా అమ్మా రాజశేఖర్ హౌస్ లో వుండే అర్హత లేదని ఖరాకండీగా చెప్పేశారు.దాంతో ఈ వారం అమ్మా ఇంటినుంచి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ తో ప్రముఖ యాంకర్ సుమ హౌస్ లోకి అడుగు పెట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. సుమ ఎంట్రీ తో బిగ్ బాస్ లో ఫన్ డబుల్ అవ్వనుందని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

Tags :
|
|
|

Advertisement