Advertisement

  • కలర్ ఫోటో సినిమాపై ప్రశంసలు కురిపించిన స్టార్ విలన్ జగపతి బాబు..

కలర్ ఫోటో సినిమాపై ప్రశంసలు కురిపించిన స్టార్ విలన్ జగపతి బాబు..

By: Sankar Fri, 30 Oct 2020 4:11 PM

కలర్ ఫోటో సినిమాపై ప్రశంసలు కురిపించిన స్టార్ విలన్ జగపతి బాబు..


ఇటీవల కాలంలో చిన్న సినిమాలలో కంటెంట్ ఉంటె థియేటర్లు ఓపెన్ ఉన్నా లేకున్నా జనం మాత్రం ఆదరిస్తున్నారు దానికి మంచి ఉదాహరణ సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మరియు కలర్ ఫోటో సినిమాలు..ముఖ్యంగా కలర్ ఫోటో సినిమా మీద ప్రశంసలు బాగా కురుస్తున్నాయి..

ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని జగ్గూభాయ్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. ఒక సినిమా హిట్ అవ్వడానికి.. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ అవసరం లేదని ‘కలర్ ఫోటో’ రుజువు చేసిందని అన్నారు స్టైలిష్ విలన్ జగపతి బాబు ఇలాంటి యంగ్ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ కలిపి టాలెంట్ తో సినిమాలు చేస్తుంటే.. తనలాంటి సీనియర్లు ఏం చేస్తున్నామో అనిపిస్తుందని జగపతిబాబు అన్నారు.

ఇలాంటి సినిమాల్లో తనకు కూడా భాగస్వామ్యం ఉంటే గర్వపడతానని.. కానీ ఈ తరహా చిత్రాలలో తాను నటించననో.. లేక డబ్బులు ఎక్కువ అడుగుతాననో భావించి తనను సంప్రదించడం లేదేమోనని.. కానీ ఆ రెండు నిజం కాదని అన్నారు. చూస్తుంటే ఈ స్టైలిష్ విలన్ చిన్న సినిమాల్లో మంచి పాత్రలు దొరికితే రెమ్యునరేషన్ తగ్గించుకొని నటించడానికి సిద్ధమని తెలుస్తుంది.

Tags :
|

Advertisement