Advertisement

  • బంధుప్రీతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా ..

బంధుప్రీతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా ..

By: Sankar Mon, 20 July 2020 3:30 PM

బంధుప్రీతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా ..



బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో బంధుప్రీతి మీద తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే ..ఇప్పటికే చాల మంది ప్రముఖులు ఈ బంధుప్రీతి మీద అనేక విమర్శలు కురిపిస్తున్నారు ..ఇప్పటికే ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ నేపోటిజం మీద ఇప్పటికి విమర్శలు చేస్తూనే ఉంది ...తాజాగా ఒకప్పటి బాలీవుడ్ ప్రముఖ హీరో గోవిందా బాలీవుడ్‌లో బంధుప్రీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్‌లో కొంతమంది వ్యక్తులు మాత్రమే చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు అంటూ గోవింద కామెంట్స్ చేశారు. తన సినిమాలను కూడా థియేటర్లో సరిగా విడుదల చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువగా ఉండటం కారణంగానే టాలెంట్ ఉన్న ఎంతో మంది నటులు రాణించలేక పోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. రోజురోజుకు ఇండస్ట్రీలో ప్రతిభకు ప్రాధాన్యత తగ్గిపోతుందన్నారు. నెపోటిజం కారణంగా ఎంతోమంది టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారని అన్నారు.

తన తల్లిదండ్రులు నిర్మలాదేవి, అరుణ్ కుమార్ లు చిత్ర పరిశ్రమకు చెందిన వారు అయినప్పటికీ తనకు మాత్రం ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయన్నారు. నటుడిగా నిరూపించుకునేందుకు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు వస్తున్న సమయంలో తాజాగా గోవింద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారాయి.

Tags :
|

Advertisement