Advertisement

  • బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అల్లు అర్జున్ కు వీడియో టాగ్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ..

బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అల్లు అర్జున్ కు వీడియో టాగ్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ..

By: Sankar Tue, 21 July 2020 4:21 PM

బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అల్లు అర్జున్ కు వీడియో టాగ్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ..



ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయినా అలా వైకుంఠపురం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే ...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైలిష్ నటనకు తోడు , థమన్ అందించిన పాటలు ఒక ఊపు ఊపాయి ..సినిమా రిలీజ్ కు ముందు సామజవరాగమన సాంగ్ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు ..ఇక రిలీజ్ తర్వాత బుట్ట బొమ్మ , రాములో రాముల పాటలు కొత్త కొత్త రికార్డు లను సృష్టిస్తున్నాయి ..ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.

తాజాగా వైజాగ్‌కు చెందిన‌ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అంతా కలిసి బుట్టబొమ్మ పాటపై చిందులేశారు.తాము డాన్స్ చేసిన ఈ వీడియోను ట్విట్ట‌ర్‌ ద్వారా బ‌న్నీకి ట్యాగ్ చేసి ఆయనను సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన అల్లు అర్జున్.. ఇలాంటి సంతోషాన్నిచ్చే ఆశ్చర్యం కలిగించినందుకు ఇండిగో సిబ్బందికి ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ పాటపై ఇండిగో సిబ్బంది ఆట చూసి ''వావ్! సూపర్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

కాగా ఈ బుట్ట‌బొమ్మ సాంగ్‌లో అల్లు అర్జున్- పూజా హెగ్డే వేసిన స్టెప్పులు మరచిపోలేక పోతున్నారు ప్రేక్షకులు. కాస్త సమయం దొరికినా ఈ పాట పెట్టుకొని డాన్స్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకు కాలు కదుపుతున్నారు..

Tags :
|
|
|

Advertisement