Advertisement

  • వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నాను ..ప్రకటించిన శృతి హాసన్

వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నాను ..ప్రకటించిన శృతి హాసన్

By: Sankar Thu, 16 July 2020 2:33 PM

వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నాను ..ప్రకటించిన శృతి హాసన్



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ..ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ..ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పవర్ స్టార్ ఫస్ట్ లుక్ మరియు పాటలు సూపర్ హిట్ అయ్యాయి దీనితో సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి ..అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఎటువంటి న్యూస్ రాలేదు ..అయితే గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ తో ఆడిపాడిన శృతి హాసన్ వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు వచ్చాయి ..అయితే వకీల్ సాబ్ సినిమా యూనిట్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ..

అయితే వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నట్లు శృతి హాసన్ ప్రకటించింది ..అవును.. నేను వకీల్‌సాబ్ మూవీ లో నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే చెప్పలేను'' అని తాజాగా ఓ మీడియా ముందు ఓపెన్ అయింది శృతి హాసన్. తాను విలన్ రోల్ పోషించేందుకైనా సిద్దమే అని, తనకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవని ఈ సందర్భంగా శృతి పేర్కొంది. అలాగే తన ఇంట్రెస్ట్ విషయమై రియాక్ట్ అవుతూ.. తాను పూర్తిగా సంగీతంపై దృష్టి పెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, ప్రస్తుతం నటన గురించే ఆలోచిస్తున్నానని తెలిపింది..

కాగా వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పవన్‌కి భార్యగా శృతి హాసన్ కనిపించనుందని టాక్.


Tags :

Advertisement