Advertisement

  • తెలుగులో శ్రీదేవి సినిమా కొత్తగా మళ్లీ విడుదల

తెలుగులో శ్రీదేవి సినిమా కొత్తగా మళ్లీ విడుదల

By: Sankar Sat, 13 June 2020 09:45 AM

తెలుగులో శ్రీదేవి సినిమా కొత్తగా మళ్లీ విడుదల


కమల్‌హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ముఖ్య తారాగణంగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘పదినారు వయదినిలే’. ఇదే సినిమా తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్‌లో రీమేక్‌ అయింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు తమిళ అనువాదాన్ని చూడబోతున్నారు. తమిళ వెర్షన్‌ని అధునాతన డాల్బీ సౌండ్‌ పద్ధతిలో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్‌ చేసి అన్ని పాటలను కొత్తగా పొందుపరచారు.


సామాజిక మాధ్యమం ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో పాటుగా ఐదు భాషల్లో అనువదించడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు సుప్రీమ్‌ ఆల్మైటీ క్రియేషన్స్‌ నిర్మాణసంస్థ వెల్లడించింది. తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అనే టైటిల్‌ను పెట్టారు. నిర్మాత బామారాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 30 నిమిషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం’’ అని అన్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.


ఇక ఈ సినిమాతో శ్రీదేవి అభిమానులను అద్భుతంగా అలరించింది ..సిరిమల్లె పువ్వా సాంగ్ తో ఒక్కసారిగా ప్రేక్షకులను తన వైపుకు ఆకర్షించుకుంది..ఈ సినిమా తర్వాత ఎన్నో అద్భుత చిత్రాలు చేసినప్పటికీ శ్రీదేవి అనగానే అందరికి గుర్తొచ్చే మొదటి సినిమా పదహారేళ్ళ వయస్సు..తక్కువ వయస్సులోనే అభిమానులను శోకసంద్రం ముంచుతు శ్రీదేవి తిరిగి లోకాలను వెళ్లినప్పటికీ ఆమె గుర్తులు అభిమానులతో ఎప్పటికి శాశ్వతంగా ఉంటాయి


Tags :

Advertisement