Advertisement

  • హిందీలో రీమేక్ అవుతున్న బ్రోచేవారెవరురా ...

హిందీలో రీమేక్ అవుతున్న బ్రోచేవారెవరురా ...

By: Sankar Thu, 17 Dec 2020 3:23 PM

హిందీలో రీమేక్ అవుతున్న బ్రోచేవారెవరురా ...


ఏ భాషలో అయిన ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే అది ఇతర భాషల్లో తీయడానికి కూడా ఆయా బాషల నటులు ఆసక్తి చూపుతున్నారు ..ఇటీవల కాలంలో బాలీవుడ్ ఎక్కువగా సౌత్ సినిమాల రీమేక్ లు నడుస్తున్నాయి..షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ తో సూపర్ హిట్ కొట్టి , ఇటీవలే నాని జెర్సీ రీమేక్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు ..ఇక అక్షయ్ కుమార్ లారెన్స్ కాంచన సినిమాను లక్ష్మి పేరుతో రీమేక్ చేసాడు..

ఇక ఆ మధ్య తెలుగులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'బ్రోచేవారెవరురా' క్రైమ్ కామెడీ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. శ్రీవిష్ణు హీరోగా నివేద థామస్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా ఏడు కోట్ల బడ్జెట్టులో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 20 కోట్లు వసూలు చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. 2019లో విడుదలైన ఈ తెలుగు చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తీసుకున్నారు.అజయ్ దేవ్‌గణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. తన స్వంత బ్యానర్‌పై చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. 'బ్రోచేవారెవరురా' క్రైమ్ కామెడీ అజయ్‌కు బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయబోతున్నాడు.

Tags :

Advertisement