Advertisement

  • హీరోయిన్ గా కంటే ఆ సాంగ్స్ బెటర్ ...హంస నందిని

హీరోయిన్ గా కంటే ఆ సాంగ్స్ బెటర్ ...హంస నందిని

By: Sankar Tue, 26 May 2020 5:06 PM

హీరోయిన్ గా కంటే ఆ సాంగ్స్  బెటర్ ...హంస నందిని

టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హంస నందిని ..తొలుత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ , స్పెషల్ సాంగ్స్ ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది...పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించిన ఆమె.. ఆ తర్వాత మాత్రం ఐటెం సాంగ్స్‌కు పరిమితం అయ్యింది. ఇప్పటివరకు చాలా వరకు ఐటెం సాంగ్‌ల్లో తన అందచందాలతో అలరించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హంసానందిని ఐటెం సాంగ్‌ల గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హీరోయిన్‌గా తనకు వచ్చే రొటీన్ పాత్రలు నచ్చకపోవడం వల్లే సినిమాల్లో స్పెషల్ సాంగ్‌ల వైపు మొగ్గు చూపానని ఈ భామ తెలిపింది. అలాంటి రొటీన్ పాత్రలు చేయడం కంటే స్పెషల్ సాంగ్‌లు చేయడం చాలా బెస్ట్ అని చెబుతోంది ఈ ఐటెం భామ. `ఈగ`, `మిర్చి` వంటి సినిమాల నుంచి స్పెషల్ అప్పీరియెన్స్‌లు ప్రారంభించానని చెప్పింది. స్పెషల్ సాంగ్‌లు రొటీన్‌గా కాకుండా వేటికవే భిన్నంగా ఉంటాయంది హంసానందిని. తనకు కూడా సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాన`ని హంసానందిని పేర్కొంది.

Tags :

Advertisement