Advertisement

  • నాన్నగారి ఆరోగ్యం విషయంలో వచ్చే రూమర్స్ ను నమ్మకండి..ఎస్పీ చరణ్

నాన్నగారి ఆరోగ్యం విషయంలో వచ్చే రూమర్స్ ను నమ్మకండి..ఎస్పీ చరణ్

By: Sankar Tue, 25 Aug 2020 09:08 AM

నాన్నగారి ఆరోగ్యం విషయంలో వచ్చే రూమర్స్ ను నమ్మకండి..ఎస్పీ చరణ్


దిగ్గజ గాయకుడూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి, గత కొన్ని రోజులుగా చెన్నై లో కరోనా తో పోరాడుతున్న విషయం తెలిసిందే..ఎస్పీ కండిషన్ కూడా సీరియస్ గా ఉంది అని అయన కొడుకు ఎస్పీ చరణ్ అన్నారు..అయితే ఎస్పీ కి కరోనా నెగటివ్ వచ్చింది అని నిన్న సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసాయి..దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది ఎస్పీ అభిమానులు ఈ వార్త తెలిసి ఆనందపడ్డారు..అయితే బాలు గారికి కరోనా నెగటివ్ రాలేదు అని అవన్నీ రూమర్స్ అని అన్నారు ఎస్పీ చరణ్..

తాజాగా వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య బృందాన్ని సంప్రదించిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ హెల్త్‌ అప్‌డేట్‌లను మీతో పంచుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ ఈ ఉదయం నుంచి ఓ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతోంది. నాన్న ఆరోగ్యం గురించి మొట్టమొదటిగా సమాచారం పొందే ఏకైక వ్యక్తి నేనే. ఆ సమాచారాన్నే నేను మీడియాతో పంచుకుంటున్నా. నాన్నగారికి కొవిడ్‌ నెగటివ్‌ వచ్చినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి.

అయితే, అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కరోనా నెగటివా? పాజిటివా? అన్న విషయం పక్కన పెడితే, ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటికీ ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇది ఇలాగే ఉంటే, ఆయన ఊపిరితిత్తులు మరింత కోలుకునే అవకాశం ఉంది. దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. వైద్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నేనే అప్‌డేట్‌ ఇస్తా. ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement