Advertisement

త్వరలోనే నాగబాబు కూతురు నిహారిక పెళ్లి

By: chandrasekar Fri, 19 June 2020 4:04 PM

త్వరలోనే నాగబాబు కూతురు నిహారిక పెళ్లి


నాగబాబు కూతురు నిహారిక త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. తనకు పెళ్లి కుదిరిందని చెప్పేసింది నిహారిక. ఈమె పోస్ట్ చేసిన న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఇదిలా ఉంటే మరో పోస్టులో ఏకంగా ఓ కుర్రాడిని హగ్ చేసుకుంది నిహారిక.

తనకు కాబోయే భర్తను హత్తుకుని మరో ఫోటో రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఆయన ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. పైగా పెళ్లి కొడుకు వివరాలను కూడా మెగా కుటుంబం గోప్యంగానే ఉంచింది. దాంతో నిహారికను చేసుకునే కుర్రాడు ఎవరబ్బా అని వెతకడం మొదలు పెట్టారు ఆడియన్స్. మెగా డాటర్ మనసు దోచిన ఓ వరుడు ఎవరో అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ పోస్ట్ చూసిన తర్వాత సినీ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు కూడా నిహారికకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రానా, నితిన్ లాంటి వాళ్లు కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు నిహారిక కూడా పెళ్లి కూతురు కాబోతుంది. హీరోయిన్స్ నిధి అగర్వాల్, లావణ్య త్రిపాఠి కంగ్రాట్స్ చెప్తూ అతని ఫేస్ చూపించమని కోరారు. త్వరలోనే తనకు కాబోయే వాడి ఫోటో విడుదలకు చేయబోతుంది నిహారిక.

నిహారిక పెళ్ళి చేసుకోబేయే వ్యక్తి గుంటూరు కుర్రాడని కొందరు అంటున్నారు. ఓ పోలీసు అధికారి కొడుకు అని వార్తలు వస్తున్నాయి. అతడి పేరు చైతన్య జొన్నలగడ్డ అని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నాడని తెలుస్తుంది. ఆగస్టులో వీళ్ల నిశ్చితార్థం ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇదే ఏడాది డిసెంబర్‌లో నిహారిక పెళ్లి ఉంటుందని సమాచారం.

Tags :
|

Advertisement