Advertisement

  • మెగాస్టార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన సోను సూద్

మెగాస్టార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన సోను సూద్

By: Sankar Wed, 18 Nov 2020 11:09 AM

మెగాస్టార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన సోను సూద్


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు.

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.కాజల్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది . ఇదిలా ఉంటే ఈ సినిమా రియల్ హీరో సోనూసూద్ కూడా నటిస్తున్నాడు. కరోనా సమయంలో వేలాదిమందికి సాయం చేసి సోను రియల్ హీరో అనిపించుకున్నాడు.

ఆ తర్వాత సోను డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనూ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో సోనూసూద్ 'ఆచార్య' సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాలోనూ సోనూ నటిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచింది...ఈ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేయడానికి చిత్రనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :
|

Advertisement