Advertisement

  • కన్నతల్లి పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగానికి గురి అయిన సోను సూద్ ..

కన్నతల్లి పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగానికి గురి అయిన సోను సూద్ ..

By: Sankar Wed, 22 July 2020 12:23 PM

కన్నతల్లి పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగానికి గురి అయిన సోను సూద్ ..



సినిమాల్లో విలన్ గా నటించిన చాలామంది రియల్ లైఫ్ లో హీరోలు అనడానికి మంచి ఉదాహరణ సోను సూద్ ..కరోనా కష్టకాలంలో సోను సూద్ చేసిన సాయం మామూలుది కాదు ..ఎందరో వలస కూలీలను తమ కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చాడు ..ముంబై లో తిండి లేక అల్లాడుతున్న ఎంతో మందికి ఆశ్రయం కలిపించాడు ..కరోనా పోరాటంలో పోరాడుతున్న డాక్టర్లు , వైద్య సిబ్బంది ఉండటానికి తన హోటల్ ఇచ్చాడు ..ఇలా సోను ఎన్నో కార్యకలాపాలు చేసాడు

ముంబైలో నిసర్గ ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎంతో మంది ప్ర‌జ‌ల‌ని సుర‌క్షిత ప్రాంతాల‌కి త‌ర‌లించి దేవుడిలా మారాడు సోనూ సూద్‌. అయితే జూలై 21 త‌న త‌ల్లి జ‌యంతి కావ‌డంతో అమ్మ‌తో కలిసి దిగిన అరుదైన ఫోటోలు షేర్ చేస్తూ ఉద్వేగానికి లోన‌య్యాడు.

పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. జీవితాంతం నాకు మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూనే ఉండాలి. నిన్ను గ‌ట్టిగా హ‌గ్ ఇచ్చి ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాల‌ని ఉంది. చాలా మిస్ అవుతున్నాను. జీవితం ఎల్ల‌ప్పుడు ఒకేలా ఉండ‌దు క‌దా, మ‌ళ్ళీ మ‌నం క‌లిసే వ‌ర‌కు నాకు మార్గదర్శక దేవదూతగా ఉండండి. మిస్ యు అమ్మ అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు సోనూ సూద్.

Tags :
|
|

Advertisement