Advertisement

  • బాలయ్య వల్ల గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు బాలయ్యకే నో చెప్పింది..!

బాలయ్య వల్ల గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు బాలయ్యకే నో చెప్పింది..!

By: Anji Mon, 07 Dec 2020 6:59 PM

బాలయ్య వల్ల గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు బాలయ్యకే నో చెప్పింది..!

బాలకృష్ణ సరసన లెజెండ్ , డిక్టేటర్ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన సోనాల్ చౌహన్..మరోసారి బాలయ్య ఛాన్స్ వస్తే ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పిందట.

బాలకృష్ణ – బోయపాటి కలయికలో మరో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాలూకా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది పేర్లు బయటికి వచ్చినా ఎవరూ ఫిక్స్ కావడం లేదు.

ఈ నేపథ్యంలో సోనాల్ ను చిత్ర యూనిట్ సంప్రదించారట. అయితే ఈ ఆఫర్ కు నో చెప్పడం తో చిత్ర యూనిట్ షాక్ అయ్యారట. ఇప్పటికే ఈ సినిమాలో ప్రయాగ మార్టిన్, సాయేషా సైగల్ పేర్లు వినిపించినా ఒక్కరు కూడా ఫైనల్ కాలేదు.

చివరికి మెయిన్ హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. మరో హీరోయిన్‌ పాత్ర కోసం సంప్రదిస్తే సోనాల్ హ్యాండ్ ఇచ్చిందట. మరి ఫైనల్ గా ఎవరు ఓకే చెపుతారో చూడాలి.

Tags :

Advertisement