Advertisement

  • బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ ఇంట్లో కరోనా ..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ ఇంట్లో కరోనా ..

By: Sankar Tue, 30 June 2020 3:52 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ ఇంట్లో కరోనా ..



కరోనా వైరస్ సామాన్యులు , సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి మీద తన పంజా విసురుతుంది ..ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సెలెబ్రిటీలు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు ..ప్రస్తుతం ముంబైలో కరోనా తీవ్ర రూపం దాల్చింది ..దేశంలోనే అత్యధిక కేసులు ముంబైలో నమోదు అవుతున్నాయి ..తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ ఇంటికి కరోనా సెగ తగిలింది ..ఈ విషయాన్నీ అమీర్ స్వయంగా వెల్లడించాడు ..

కుటుంబ సభ్యులందరికీ నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చిందని ఆమీర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. అయితే తన తల్లికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఆమెకు నెగిటివ్ రావాల్సిందిగా కోరుకోవాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా తక్షణం స్పందించి, సహాయం అందించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోకిలా బెన్ ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు కూడా ఆమీర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.తన సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని స్వయంగా ఆమీర్ వెల్లడించారు. వెంటనే వారిందరినీ క్వారంటైన్ చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆమీర్ ఈ సమాచారాన్ని షేర్ చేశారు.

కాగా టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్' హిందీ రీమేక్ లో 'లాల్ సింగ్ చద్దా' లో అమీర్ కనిపించనున్నారు. 'సీక్రెట్ సూపర్ స్టార్' దర్శకుడు అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అమీర్ సరసన కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆమీర్ భార్య కిరణ్ రావు దీన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Tags :
|
|

Advertisement