Advertisement

  • కేజీఎఫ్ చాప్టర్ 2 లో ప్రకాష్ రాజ్ కనిపించడంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశ

కేజీఎఫ్ చాప్టర్ 2 లో ప్రకాష్ రాజ్ కనిపించడంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశ

By: chandrasekar Tue, 01 Sept 2020 09:34 AM

కేజీఎఫ్ చాప్టర్ 2 లో ప్రకాష్ రాజ్ కనిపించడంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశ


కేజీఎఫ్ చాప్టర్ 2 లో ప్రకాష్ రాజ్ కనిపించడంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కన్నడ డ్యాషింగ్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ భారీ విజయం సాధించడంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై దర్శక నిర్మాతలు బాగా ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవలే చాప్టర్ 2 చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ఇందులో ప్రకాష్ రాజ్ కనిపించడంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశకు గురి అయ్యారు. కేజీఎఫ్ చాప్టర్ 1 లో కనిపించిన అనంత్ నాగ్ ను తీసేసి ప్రకాష్ రాజ్ ను రీప్లేస్ చేయడం ఏ మాత్రం బాగోలేదు మేము సినిమాను బాయ్ కాట్ చేస్తామని అన్నారు. అయితే దీనిపై దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.

ప్రేక్షకుల మధ్య మంచి ప్రజాదరణ పొందిన కేజీఎఫ్ ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ప్రారంభించింది. అందరూ అనుకుంటున్నట్టు కేజీఎఫ్ చాప్టర్ 2లో అనంత్ నాగ్ పాత్రను ప్రకాష్ రాజ్ రీప్లేస్ చేయడం లేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. కేజీఎఫ్ చాప్టర్ 1లో నటించిన అనంత్ నాగ్ పాత్ర రెండో చాప్టర్ లో కూడా కొనసాగుతుంది అని అయితే మరో పాత్ర రంగ ప్రవేశం చేస్తుంది అని దీన్ని ప్రకాష్ రాజ్ పోషిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పూర్తిగా కొత్త పాత్రలో కనిపించనున్నారు అని అంతే కానీ అనంత్ నాగ్ పాత్రకు ప్రకాష్ రాజ్ రీప్లెస్ మెంట్ కాదు అని తెలిపారు. అదనంగా ప్రకాష్ రాజ్ నటించడంతో మరింత హంగామాతో ఈ చిత్రం రూపు దిద్దుకుంటుందని తెలిపారు.

Tags :

Advertisement