Advertisement

  • డిసెంబర్ 25 న రిలీజ్ కానున్న మెగా హీరో మూవీ

డిసెంబర్ 25 న రిలీజ్ కానున్న మెగా హీరో మూవీ

By: Sankar Fri, 18 Dec 2020 5:41 PM

డిసెంబర్ 25 న రిలీజ్ కానున్న మెగా హీరో మూవీ


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుసగా రెండు హిట్లు కొట్టి మంచి ఊపులో ఉన్నాడు..ప్రతి రోజు పండగే , చిత్ర లహరి సినిమాలు విజయంతో మళ్ళీ రేస్లోకి వచ్చిన తేజ్ , ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అనే సినిమాలో చేస్తున్నాడు...అయితే సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నూతన దర్శకుడు సుబ్బు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నభనటేష్ హీరోయిన్. అయితే.. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

కరోనా కారణంగా ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ లోనే రిలీజ్‌ అవుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా.. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. డిసెంబర్‌ నెలలో థియేటర్లు ఓపెన్‌ కానుండటంతో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేయడానికే మొగ్గు చూపింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా టీజర్ కూడా అతి త్వరలోనే రిలీజ్ కానుంది.

Tags :
|

Advertisement