Advertisement

సమంత హీరోయిన్ గా హారర్ థ్రిల్లర్ సినిమా

By: Sankar Wed, 14 Oct 2020 4:37 PM

సమంత హీరోయిన్ గా హారర్ థ్రిల్లర్ సినిమా


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరొక ప్రయోగాత్మక సినిమాకు సిద్దమయింది కేవలం కమెర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా వైవిధ్య సినిమాలు సమంత ముందు ఉంటుంది...గతే ఏడాది ఆమె నుంచి ఓ బేబీ వంటి ప్రయోగాత్మక చిత్రం వచ్చి విమర్శకుల ప్రశంసలందుకుంది..

రెండు భిన్న పార్శాలు కలిగిన పాత్రలో సమంత అభినయం అందరిని మెప్పించింది. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ హారర్‌ థ్రిల్లర్‌ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సోనీ పిక్చర్స్‌ సంస్థ తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. తొలుత ఈ సినిమాకు తమిళ దర్శకుడు అశ్విన్‌శరవణన్‌ను డైరెక్టర్‌గా తీసుకున్నారు.

అనివార్య కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో నందినిరెడ్డి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టినట్లు తెలిసింది. హారర్‌, థ్రిల్లర్‌ అంశాల కలబోతగా వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందని చెబుతున్నారు.

Tags :

Advertisement