Advertisement

  • ఇక మీదట పోలీస్ సినిమాలు చేయను ..సింగం దర్శకుడు హరి

ఇక మీదట పోలీస్ సినిమాలు చేయను ..సింగం దర్శకుడు హరి

By: Sankar Mon, 29 June 2020 2:04 PM

ఇక మీదట పోలీస్ సినిమాలు చేయను ..సింగం దర్శకుడు హరి



సూర్య సూపర్ హిట్ సినిమాలు అయినా సింగం సిరీస్ సినిమాల దర్శకుడు హరి ..తమిళనాడులో జరిగిన తండ్రి కొడుకుల హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేసాడు ..విధి నిర్వహణలో పోలీసుల సవాళ్లు, వారి ధైర్యసాహసాలను హైలైట్ చేసిన చిత్ర దర్శకుడిగా పేరుగాంచిన హరి ఇకపై అలాంటి సినిమాలను చేయనంటూ కీలక ప్రకటన విడుదల చేశారు..

జయరాజ్, బెన్నిక్స్ దారుణ హత్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరి ఇలాంటి సంఘటనలు మళ్లీ తమిళనాడులో జరగకూడదు. కొద్దిమంది అధికారుల కారణంగా, మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. పోలీసులను ప్రశంసిస్తూ ఐదు సినిమాలు చేసినందుకు చింతిస్తున్నానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. హరి దర్శకత్వంలో వచ్చిన సింగం, సింగం-2, సింగం-3, సామి, సామి-2 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి.

కాగా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించారంటూ పి జయరాజ్ , ఆయన కుమారుడు బెన్నిక్స్ లను పోలీసులు అరెస్టు చేయగా, రెండు రోజుల అనంతరం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో వీరు మరణించడం కలకలం రేపింది. గుండెపోటుతో మరణించారని పోలీసులు ప్రకటించగా, తీవ్రంగా హింసించి, చంపేశారంటూ నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Tags :
|
|
|

Advertisement