Advertisement

Flash News: సింగర్ సునీత రెండో పెళ్లి వాయిదా...!

By: Anji Wed, 16 Dec 2020 2:23 PM

Flash News: సింగర్ సునీత రెండో పెళ్లి వాయిదా...!

గాయ‌ని సునీత కొద్ది రోజుల క్రితం మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్‌తో త‌న‌ నిశ్చితార్ధం జ‌రిగిన సంద‌ర్భానికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను సునీత‌ షేర్ చేసిన విషయం తెలిసిందే.

త‌న‌కు మంచి మిత్రుడైన రామ్‌తో జీవితాన్ని పంచుకోకున్న‌ట్లు ఆమె తెలిపారు. ఇంత‌కు ముందు హైద‌రాబాద్‌లో కొద్ది మంది స‌న్నిహిత మిత్రులు, కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో డిసెంబ‌ర్ 27న వారి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

అయితే తాజాగా లేటెస్ట్‌గా పెళ్లి తేదీ ఇంకా ఖ‌రారు కాలేద‌నీ, వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రికి వారి పెళ్లి వాయిదా ప‌డింద‌నీ తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్లే పెళ్లి తేదీ ఫిబ్ర‌వ‌రికి మారింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కొద్ది రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో తను మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్న విష‌యాన్ని వెల్ల‌డించిన సునీత‌, "ప్ర‌తి త‌ల్లి మాదిరిగానే, నా పిల్ల‌లు బాగా స్థిర‌ప‌డాల‌ని నేను క‌ల‌లు కంటున్నాను.

అదే స‌మ‌యంలో, నేను జీవితంలో బాగా సెటిలవ‌డం చూడాల‌ని ఎప్పుడూ కోరుకొనే అద్భుత‌మైన‌, ఆలోచ‌నాత్మ‌క‌మైన పిల్ల‌లు, త‌ల్లిదండ్రుల‌ను క‌లిగి ఉండ‌టం నా భాగ్యం. ఆ క్ష‌ణం ఎట్ట‌కేల‌కు వ‌చ్చింది. రామ్ నా జీవితంలోకి ఒక కేరింగ్ ఫ్రెండ్‌గా, వండ‌ర్‌ఫుల్ పార్ట‌న‌ర్‌గా అడుగుపెట్టారు.

అతి త్వ‌ర‌లోనే వైవాహిక బంధంలోకి ప్ర‌వేశిస్తుండ‌టం మా ఇద్ద‌రికీ ఆనందంగా ఉంది." అంటూ రాసుకొచ్చారు. సునీత‌, రామ్ ఇద్ద‌రికీ ఇది రెండో వివాహం కావ‌డం గ‌మ‌నార్హం.

సునీతకు పందొమ్మిదేళ్ల వ‌య‌సులో గోప‌రాజు కిర‌ణ్ కుమార్ అలియాస్ ల‌క్కీతో మొద‌టి వివాహం జ‌రిగింది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు.. ఆకాశ్‌, శ్రేయ‌. ప‌దేళ్ల‌పాటు స‌జావుగానే న‌డిచిన వారి సంసారం.. ఆ త‌ర్వాత ఇబ్బందుల్లో ప‌డింది.

ద‌శాబ్దం క్రితం విడిపోయిన వారు, త‌ర్వాత విడాకులు కూడా తీసుకున్నారు. రామ్ కూడా చాలా కాలం క్రిత‌మే మొద‌టి భార్య‌తో విడిపోయారు. కొంత‌కాలంగా స్నేహితులుగా ఉన్న సునీత, రామ్‌.. మ‌న‌సులు క‌లియ‌డంతో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే ఈ విష‌యాన్ని వారు ఇంత‌కాలం ర‌హ‌స్యంగా ఉంచారు. పెద్ద‌లు, పిల్ల‌లు కూడా అంగీక‌రించ‌డంతో రెండు కుటుంబాల స‌మ‌క్షంలో నిశ్చ‌య తాంబూలాలు తీసుకున్నారు.

Tags :

Advertisement