Advertisement

Flash News: సింగర్ సునీత పెండ్లి డేట్ ఫిక్స్...!

By: Anji Sat, 26 Dec 2020 4:58 PM

Flash News: సింగర్ సునీత పెండ్లి డేట్ ఫిక్స్...!

సింగర్ సునీత పెండ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే.

ఇక అందరి దృష్టి ఆమె పెళ్ళెప్పుడు అనే దానిపై పడింది. దీంతో ఒక్కొక్కరూ ఒక్కో విధమైన తేదీలతో ప్రచారం చేస్తున్నారు. ఆమె పెళ్లి ఈ నెల 27న జరిగే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది.

సునీత మొదటి భర్తతో చాలాకాలం క్రితమే విడిపోయి పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించి నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేశారు.

ఇద్దరి జాతకాల ప్రకారం వివాహం డిసెంబర్ 26న చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో పెళ్లి వాయిదా పడింది.

గత వారం కాబోయే భర్తతో కలిసి ఆమె ప్రీ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. తాజాగా వీరి వివాహాన్ని జనవరి 9న నిర్వహించాలని ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించారట.

వివాహానికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానిస్తారని తెలుస్తోంది. మరోవైపు సినీ పరిశ్రమలోని సెలబ్రిటీల కోసం సునీత-రామ్ కలిసి ఈరోజు(శనివారం) ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఏర్పాటు చేశారు.

Tags :

Advertisement