Advertisement

  • నాకు అసలు మేనల్లుడు ఎవ్వరు లేరు ..దయచేసి వాడి మోసాలను నమ్మకండి ...సింగర్ సునీత

నాకు అసలు మేనల్లుడు ఎవ్వరు లేరు ..దయచేసి వాడి మోసాలను నమ్మకండి ...సింగర్ సునీత

By: Sankar Tue, 28 July 2020 09:39 AM

నాకు అసలు మేనల్లుడు ఎవ్వరు లేరు ..దయచేసి వాడి మోసాలను నమ్మకండి ...సింగర్ సునీత



ఇటీవల కాలంలో ప్రముఖుల పేర్లు చెప్పి మోసాలు చేయడం చూస్తూనే ఉన్నాం ..ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి పేరు మీద , మరియు గీత ఆర్ట్స్ పేరు మీద ఇప్పటికే మోసాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే ..తాజాగా స్టార్ సింగర్ సునీత కూడా ఇలాంటి మోసాల గురించి మాట్లాడింది ...

సింగర్ సునీత మేనల్లుడిని అని చెప్పుకుంటూ చైతన్య అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతుండటం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా స్పందించిన సునీత.. తనకు మేనల్లుడు ఎవరూ లేరని, దయచేసి అలాంటి వారిని నమ్మకండి అంటూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఓ ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. చైతన్య అనే అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి నా మేనల్లుడు అని చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది. చాలామంది సెలబ్రిటీలతో కూడా నా పేరు చెప్పి పరిచయాలు పెంచుకుంటున్నాడట. అలాగే అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర డబ్బులు కాజేస్తున్నాడని తెలిసింది. ఈ విషయం తెలిసి నేను షాకయ్యాను. చైతన్య అనే వాడెవడో కూడా నాకు తెలియదు. వాడి మాటలు నమ్మి మోసపోకండి. ఎవ్వరూ మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా.

సెలబ్రిటీకి చుట్టం అని చెప్పగానే వారికి డబ్బులిచ్చి ఎలా మోసపోతున్నారు. కొంచమైనా ఆలోచించాలి కదా!. ఇకనైనా బయటి వ్యక్తులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే జాగ్రత్తగా ఉండండి. దయచేసి డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవడో నాకు తెలియదు. వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్! పోలీస్ కంప్లైంట్ చేస్తా.. వాడిని వదలను’’ అని పేర్కొంటూ ఫైర్ అయింది సునీత.

Tags :
|
|
|

Advertisement