Advertisement

  • నాకు ఉన్న కష్టాలు చాలు..కొత్తవి అవసరం లేదు..సింగర్ సునీత

నాకు ఉన్న కష్టాలు చాలు..కొత్తవి అవసరం లేదు..సింగర్ సునీత

By: Sankar Thu, 20 Aug 2020 2:01 PM

నాకు ఉన్న కష్టాలు చాలు..కొత్తవి అవసరం లేదు..సింగర్ సునీత


ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు ఏమైనా వీడియో పెడితే దాని మీద ఎదో ఒకటి మాట్లాడటానికి కొంతమంది రెడీ గా ఉంటున్నారు..ఆ వీడియోలో ఉన్న సమాచారం వదిలేసి అందులో ఉన్న తప్పులను వెతకడం ప్రారంభిస్తున్నారు..తాజాగా సింగర్ సునీత కు ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది..కరోనా వచ్చింది అని ఇటీవల ఒక వీడియో పెడితే ఆ వీడియో మీద అనేక మంది బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు..

ఈ సందర్భంగా వీటిపై ఆమె స్పందిస్తూ.. తన ఫేస్ బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో.. నాకు ఉన్నవి చాలవా? అంటూ తన బాధను వ్యక్తపరిచారు సునీత. ‘అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియోకి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు. ఈ వీడియో యూట్యూబ్‌లో చెక్కర్లు కొడుతోంది. మంచిదే.. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా అభిమానులు నాతో మాట్లాడుతూ వుంటారు. అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది.

కానీ విషయం వదిలేసి సమాజం లో ఉన్న చాలా మంది న్యాయనిర్ణేతలు (కోర్టులో ఉండేవారు కాదు) "ఏ తెలుగు రాదా, ఫ్యాషన్ ఆ, కారోనా వస్తే ముందు హాస్పిటల్‌కి వెళ్లి చావు.. మీడియాలో పబ్లిసిటీ కోసం అవసరమా’ లాంటి తీర్మానాలు చేస్తుంటే ఈరోజు నుండి కారోనా గురించి నా అనుభవం మరియు నేను కల్పించాలనుకున్న అవగాహన కార్యక్రమాలు విరమించుకుంటున్నాను. ఇంకా ఏం వినాల్సొస్తుందో .. వున్నవి చాలవా... గాడ్ బ్లెస్ యూ.. మీకో నమాస్కారం అంటూ ఎమోజీలను తన పోస్ట్‌లో షేర్ చేసింది సింగర్ సునీత.

Tags :
|

Advertisement