Advertisement

  • నితిన్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న స్టార్ హీరోయిన్

నితిన్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న స్టార్ హీరోయిన్

By: Sankar Thu, 27 Aug 2020 1:15 PM

నితిన్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న స్టార్ హీరోయిన్


ఈ ఏడాది భీష్మ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'రంగ్ దే' సినిమా లో నటిస్తున్న నితిన్ ఆ తరవాత బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన "అంధాదున్ " సినిమాను రీమేక్ చేస్తున్నాడు. హిందీ అంధాదున్ సినిమాకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించగా ఆయుష్మాన్ ఖురానా - రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో నటించింది.

కాగా నితిన్ నటించినబోయే ఈ సినిమా తెలుగు రీమేక్ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇందులో హీరోయిన్ కంటే హిందీలో టబు చేసిన పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది చాలా ఆసక్తిగా మారింది. అయితే మొదట టబునే తెలుగులో ఆ పాత్రలో నటిస్తుంది అని వార్తలు వచ్చిన ఆ తర్వాత నయనతార నటిస్తుంది అన్నారు. కానీ ఆవిడ భారీ రెమ్యునరేషన్ అడగటంతో ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ దగ్గరకు వెళ్లారట!.

తాజాగా ఈ చిత్రబృందం శ్రియా ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. శ్రియా కూడా దానికి ఒప్పుకున్నట్లు అలాగే రెమ్యునరేషన్ కూడా తమ బడ్జెట్ లో ఉండటంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నట్లు సమాచారం. కొన్నిరోజులో ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

Tags :
|

Advertisement