Advertisement

రాజమౌళి మూవీ లో స్టార్ హీరోయిన్

By: Sankar Tue, 09 June 2020 11:59 AM

రాజమౌళి మూవీ లో స్టార్ హీరోయిన్


ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన నటి శ్రీయ ..చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలతో సినిమాలు చేసింది ..ఈ తరంలో చిరంజీవి , నాగార్జున , బాలయ్య , వెంకటేష్ లాంటి నలుగురు అగ్ర హీరోలతో సినిమాలు చేసిన అతి కొద్దీ మంది హీరోయిన్లలో శ్రీయ ఒకరు..దాదాపు ఇండస్ట్రీ కి వచ్చి పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఇంకా హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది..తాజాగా ఒక భారీ సినిమా లో చేసే అవకాశం దక్కించుకుంది ..

shriya,rrr,rajamouli,ntr,ramcharan,ajay devaghan , శ్రీయ, ఇండస్ట్రీ ,  భారీ సినిమా,  రాజమౌళి బాలయ్య

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘ఛత్రపతి’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమాలు విడుదలై దాదాపు 15 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు శ్రియ స్వయంగా తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో ఆమె చేయబోతున్న సినిమా ఇదే. లాక్‌డౌన్‌ కారణంగా భర్త ఆండ్రీతో కలసి స్పెయిన్‌లో ఉంటున్న శ్రియ అభిమానులతో చిట్‌చాట్‌ చేస్తూ తన తర్వాతి ప్రాజెక్ట్‌ల వివరాలు చెప్పుకొచ్చారు.

తెలుగులో రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపానని, వాటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటనీ అన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లలో అజయ్‌ దేవగన్‌తో కలసి నటించబోతున్నట్లు పేర్కొన్నారీ బ్యూటీ. అంటే... ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌కి జోడీగా ఆమె కనిపిస్తారని ఊహించవచ్చు. అలాగే సృజన దర్శకత్వం వహిస్తున్న ‘లిటిల్‌ బర్డ్‌’ అనే తెలుగు సినిమాలోనూ నటించనున్నారు శ్రియ. మహిళా దర్శకురాలితో పని చేయలేదనే లోటు ఈ సినిమాతో తీరనుంది అన్నారామె. అంతేకాదు.. తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఓ సినిమా అంగీకరించాననీ, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఇండియాకి వచ్చాక ఆయా చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటానని శ్రియ అన్నారు.

Tags :
|
|
|

Advertisement