Advertisement

శిల్పాశెట్టి టిక్ టాక్ వీడియోలు

By: chandrasekar Mon, 08 June 2020 3:44 PM

 శిల్పాశెట్టి టిక్ టాక్ వీడియోలు


బాలీవుడ్ నటి శిల్పా శెట్టి టిక్‌టాక్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే పరిమిత‌మైన ఈ అమ్మ‌డు త‌న‌ భర్త రాజ్‌కుంద్రా, కుమార్తె షమిశ, కుమారుడు వియాన్‌, సోదరి షమిశశెట్టితో కూడా క‌లిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డికి 1.73 కోట్ల ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, వ‌ర‌ల్డ్ టాప్ 50లో చోటు సంపాదించుకుంది.

టిక్‌టాక్‌లో తుఫాను భీబ‌త్సం సృష్టిస్తున్న శిల్పా శెట్టి రీసెంట్‌గా సౌత్ హిట్స్‌కి సంబంధించి వీడియో చేసింది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా అనే తెలుగు పాట‌తో మొద‌లుపెట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీ త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ, గుజ‌రాతీ సినిమాల‌లోని హిట్ పాట‌ల‌కి త‌న‌దైన శైలిలో హావ‌భావాలు క‌న‌బ‌రుస్తూ అల‌రించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. శిల్పా శెట్టి తెలుగులో సాహ‌స‌వీరుడు సాగ‌ర‌క‌న్య‌, భ‌లేవాడివి బాసు త‌దిత‌ర చిత్రాల‌లో న‌టించింది.


Tags :
|
|

Advertisement