Advertisement

  • కింగ్ ఖాన్ సినిమా కెరీర్ కు 28 ఏళ్ళు..ట్విట్టర్లో అభిమానులకు ధన్యవాదాలు చెప్పిన షారుక్ ఖాన్

కింగ్ ఖాన్ సినిమా కెరీర్ కు 28 ఏళ్ళు..ట్విట్టర్లో అభిమానులకు ధన్యవాదాలు చెప్పిన షారుక్ ఖాన్

By: Sankar Sun, 28 June 2020 7:47 PM

కింగ్ ఖాన్ సినిమా కెరీర్ కు 28 ఏళ్ళు..ట్విట్టర్లో అభిమానులకు ధన్యవాదాలు చెప్పిన షారుక్ ఖాన్



షారుక్ ఖాన్ ..ఈ పేరుకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ఏ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ..ముందు సీరియల్స్ లో ఆ తర్వాత యాంకర్ గా ఇలా అనేక పాత్రలు పోషించి మెల్లగా నటుడిగా అవకాశాలు సంపాదించి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ కింగ్ ఖాన్ గా ఎదిగాడు ..దిల్వాలే దుల్హనియా లేజాయేంగే , కభీ ఖుషి కభీ గమ్, చెన్నై ఎక్స్ ప్రెస్ వంటి బంపర్ హిట్లతో బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు ..

అయితే తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించి నేటితో 28 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కింగ్‌ఖాన్ తన అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. తన ప్యాషన్ ఎప్పుడు జీవిత లక్ష్యంగా మారిందో, అక్కడి నుంచి వృత్తిగా ఎప్పుడు మారిందో కూడా తనకు తెలియలేదని షారుఖ్ చెప్పాడు. ‘నా ప్రొఫెషనలిజానికన్నా కూడా నా ప్యాషన్‌తో మరింతకాలం మీకు సేవలందించగలనని నమ్ముతున్నా. ఇంతకాలం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు.

అయితే ఇటీవల కాలంలో సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడ్తున్న కింగ్ ఖాన్ ..ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు ..ఇటీవల కాలం లో తీసిన సినిమాలు సరైన హిట్లు సాధించకపోవడంతో కొంచెం వెనుక పడ్డట్లు అనిపిస్తున్నాడు ..అయితే ఒక సరైన హిట్ పడితే మళ్లీ షారుక్ ఖాన్ తన స్థాయిని అందుకుంటాడు

Tags :
|
|
|
|

Advertisement