Advertisement

  • నేను బతికుండగానే నా బయోపిక్ రావడం ఆనందంగా ఉంది ..షకీలా

నేను బతికుండగానే నా బయోపిక్ రావడం ఆనందంగా ఉంది ..షకీలా

By: Sankar Sun, 20 Dec 2020 3:09 PM

నేను బతికుండగానే నా బయోపిక్ రావడం ఆనందంగా ఉంది ..షకీలా


సౌత్ ఇండియాలో 90 వ దశకంలో ఒక ఊపు ఊపిన హీరోయిన్ షకీలా ...షకీలా సినిమా వస్తుంది అంటే పెద్ద హీరోలు కూడా సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నారు అంటే షకీలా ప్రభంజనం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు..అయితే షకీలా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి.

వాటన్నింటికీ తెర రూపమిచ్చే ప్రయత్నమే ‘షకీలా’ బయోపిక్. ఈ సినిమాలో షకీలా పాత్రలో రిచా చద్దా కనిపించనుంది. ఇంద్రజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా గురించి షకీలా మాట్లాడుతూ ‘నేను బతికి ఉండగానే నా బయోపిక్‌ రూపొందడం ఎంతో ఆనందంగా ఉంది. రిచా చద్దా అద్భుతంగా నటించింది. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నో బాధలుంటాయి. నేను గౌరవాన్నో, సానుభూతినో కోరుకోవడం లేదు. అయితే నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కలేదని నేను భావిస్తాను.

Tags :
|
|
|
|

Advertisement