Advertisement

షకీలా తెలుగు ట్రైలర్ రిలీజ్

By: Sankar Sat, 26 Dec 2020 3:25 PM

షకీలా తెలుగు ట్రైలర్ రిలీజ్


షకీలా ...సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో ఈ పేరు కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు...అప్పట్లో ఆమె సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి.

కానీ రాను రాను ఆమె క్రేజీ తగ్గిపోయింది. ఆమె సినిమాలు కనుమరుగైపోయాయి. కొంతమంది ఆమె సక్సెస్‌ను చూడలేక తొక్కేశారని కామెంట్స్‌ కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాను తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్‌ లంఖేష్‌.

బాలీవుడ్‌ నటి రిచా చద్దా లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో షకీలా శృంగార నాయిక‌గా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది వంటి కీల‌క అంశాల‌తోపాటు ఆమె జీవితంలోని మ‌రిన్ని కోణాలను చూపించారు. తెర వెనుక షకీలా జీవితం ఎలా ఉందనే అంశాలను చూపించినట్లు సినిమా చూస్తే తెలుస్తోంది. ఇక నూతన సంవత్సరం కానుకగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 1న తెలుగు,తమిళం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Tags :
|

Advertisement