Advertisement

వర్మ జీవితంపై వెబ్ సిరీస్..?

By: Sankar Tue, 21 July 2020 8:35 PM

వర్మ జీవితంపై వెబ్ సిరీస్..?



సంచలన చిత్రాలతో ఎప్పుడు వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ ..ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు కరోనా కాలాన్ని చాల చక్కగా వినియోగించుకున్న వర్మ వరుసగా సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు ..అయితే ఇంతవరకు బానే ఉంది గాని , పవర్ స్టార్ అని ఎప్పుడు అయితే సినీమా మొదలు పెట్టాడో ఇక అక్కడి నుంచి కథ మారింది ...ఎవరి స్టోరీ కాదు అని చెబుతూనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథతో సినిమా తెరకెక్కిస్తున్నాడు .దీనితో ఈ సారి పవన్ ఫాన్స్ మాటలతో కాకుండా వర్మ దారిలోనే ఆయనకు సమాధానం చెబుతున్నారు

వ‌ర్మ‌ను కౌంట‌ర్ అటాక్ చేస్తూ కొంత‌మంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఆర్జీవీకి వ్య‌తిరేకంగా ప‌రాన్నజీవి అనే చిత్రాన్ని కూడా తీస్తున్నారు. తాజాగా మ‌రో వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. రాంగోపాల్ వ‌ర్మ జీవితం ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ ను తెర‌రూపం దాల్చేందుకు ప్లాన్ జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆర్జీవీ జీవితంలో చీక‌టి కోణాల‌ను ఆవిష్క‌రిస్తూ సాగే ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ కోసం జ‌బర్ద‌స్త్ తో పాపుల‌ర్ క‌మెడియ‌న్ గా పేరు తెచ్చుకున్న ష‌క‌ల‌క శంక‌ర్ ను తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఇంత‌కీ ఈ వెబ్ సిరీస్ ను తెర‌కెక్కించేదెవ‌రు..ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.



Tags :
|
|
|

Advertisement