Advertisement

ప్రియాంకాకు షారుఖ్ పెళ్లి ప్రపోజల్ !

By: Anji Mon, 31 Aug 2020 08:11 AM

ప్రియాంకాకు  షారుఖ్ పెళ్లి ప్రపోజల్ !

2000 సంవ‌త్స‌రంలో ఫెమినా మిస్ ఇండియా పోటీలు జ‌రిగిన‌ప్పుడు ఈ సంద‌ర్భం చోటు చేసుకుంది. ఆ పోటీల్లో టాప్ టెన్ ఫైన‌లిస్టుల్లో ప్రియాంకా చోటు ద‌క్కించుకుంది. అప్పుడామె వ‌య‌సు 17 సంవ‌త్స‌రాలు. అప్ప‌టి జ్యూరీ మెంబ‌ర్స్‌లో షారుఖ్ ఖాన్ ఒక‌డు. అందాల పోటీల్లో భౌతిక సౌంద‌ర్యంతో పాటు మాన‌సిక దృఢ‌త్వాన్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌నే విష‌యం తెలిసిందే.

జ్యూరీ మెంబ‌ర్‌గా ప్రియాంక‌కు ప‌రీక్ష పెట్ట‌డానికి షారుఖ్ ఓ ప్ర‌శ్న సంధించాడు. కావాల‌ని అడిగాడో, య‌థాలాపంగా అడిగాడో కానీ.. అత‌ను అడిగిన ఆ ప్ర‌శ్న ఆ త‌ర్వాత నిజ జీవితంలో కొంత కాలం పాటు అత‌డిని వెన్నాడింది. "ఇది ఊహాత్మ‌క‌మైంది. నువ్వు ఎవ‌రిని పెళ్లాడ‌తావు? అజార్ భాయ్ (అజారుద్దీన్‌) లాగా ఇండియ‌న్ క్రికెట్‌లో రికార్డులు సృష్టించి దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచే ఒక గొప్ప భార‌తీయ క్రీడాకారుడినా, నిన్ను ప్ర‌పంచ‌మంతా తిప్పుతూ, నిన్ను ఆభ‌ర‌ణాల‌తో నింపేసి గ‌ర్వ‌ప‌డేలా చేసే స్వ‌రోవ్‌స్కీ లాంటి వ్యాపార‌వేత్త‌నా, లేక ఇలాంటి ఊహాత్మ‌క పెళ్లి గురించిన ఇలాంటి క్లిష్ట‌మైన‌ మ‌ల్టిపుల్ చాయిస్ క్వ‌శ్చ‌న్స్ వేసే నా లాంటి హిందీ ఫిల్మ్ స్టార్‌నా?" అని ప్రియాంక‌ను ప్ర‌శ్నించాడు షారుఖ్‌. ఈ ప్ర‌శ్న‌కు ప్రియాంక ఏమాత్రం త‌డుముకోలేదు.

షారుఖ్ ప్ర‌శ్న ముగియ‌డం ఆల‌స్యం, "నేను గ్రేట్ ఇండియ‌న్ స్పోర్ట్స్‌మ‌న్‌నే ఎంచుకుంటాను. ఎందుకంటే నేను ఇంటికి తిరిగొచ్చినా, లేక త‌ను ఇంటికొచ్చినా అత‌డిని చూసి ఇండియా గ‌ర్వ‌ప‌డుతోందో, నేను కూడా అంతే గ‌ర్విస్తున్నాన‌ని చెప్పి అత‌డికి స‌పోర్ట్‌గా ఉండాల‌నుకుంటాను. "చూడండి.. మీరు మీ వంతు కృషి చేశారు "అని నేను చెప్ప‌గ‌ల‌గాలి. నా దేశం గ‌ర్వించేలా చేయ‌గ‌ల బ‌ల‌మైన వ్య‌క్తిత్వం ఉన్న నా భ‌ర్త‌ను చూసి నేనూ గ‌ర్వ‌ప‌డ‌తాను" అని స‌మాధాన‌మిచ్చింది ప్రియాంక‌. అప్పుడు అలా తొలిసారిగా ఒక‌రికొక‌రు తార‌స‌ప‌డ్డ షారుఖ్‌, ప్రియాంక‌.. త‌ర్వాత కాలంలో జంట‌గా సినిమాలు చేశారు.

'డాన్ 2' టైమ్‌లో ఇద్ద‌రూ ప‌లుసార్లు ప్రైవేట్‌గా క‌నిపించి వ‌దంతుల‌కు ఆస్కార‌మిచ్చారు. ఒక సంద‌ర్భంలో అయితే తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు క‌లిసి క‌నిపించారు. దీని గురించి అడిగితే, తాము రిహార్స‌ల్స్ కోసం వ‌చ్చామ‌ని చెప్పారు. కానీ దీన్ని షారుఖ్ భార్య గౌరీ ఖాన్ తేలిగ్గా తీసుకోలేదు. ఆమె షారుఖ్‌కు గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత షారుఖ్‌, ప్రియాంక మ‌ళ్లీ ఎప్పుడూ ప‌బ్లిక్‌గా క‌లిసి క‌నిపించ‌లేదు.

Tags :

Advertisement