Advertisement

రామ్ గోపాల్ వర్మ కరోనా మీద సంచలన సినిమా

By: Sankar Tue, 26 May 2020 11:11 AM

రామ్ గోపాల్ వర్మ కరోనా మీద సంచలన సినిమా

సంచలన చిత్రాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ..మరొక సంచలనానికి తెరలేపాడు ..ఇటీవలే మియా మాల్కోవా ప్రధాన పాత్రలో క్లైమాక్స్ అంటూ మూవీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ..ఇప్పుడు ఏకంగా కరోనా మీదనే సినిమా తీసేసాడు.ఆ సినిమాకు ‘కరోనా వైరస్’ అని టైటిల్ పెట్టారు. సినిమా మొత్తాన్ని లాక్‌డౌన్ పీరియడ్‌లోనే షూట్ చేసినట్టు వర్మ తెలిపారు. ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘కరోనా వైరస్ పేరిట ఫీచర్ ఫిల్మ్ చేశాను. ఈ సినిమా మొత్తాన్ని లాక్‌డౌన్ పీరియడ్‌లో షూట్ చేశాం. ఇది కరోనా వైరస్ సబ్జెక్ట్ మీద తీసిన ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా కానుంది. మా నటీనటులు, ఇతర సిబ్బంది తమ క్రియేటివిటీని నిరూపించుకున్నారు. లాక్‌డౌన్‌లో ఉన్నా వాళ్లు మాత్రం లాక్డ్ డౌన్ కాలేదు. రేపు 26న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement