Advertisement

  • సినీ నటి ఇండస్ట్రీ లో నెపోటిజంపై సంచలన కామెంట్స్

సినీ నటి ఇండస్ట్రీ లో నెపోటిజంపై సంచలన కామెంట్స్

By: chandrasekar Sat, 27 June 2020 6:10 PM

సినీ నటి ఇండస్ట్రీ లో నెపోటిజంపై సంచలన కామెంట్స్


బాలీవుడ్ లో ఇటీవల చోటుచేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం యావత్ సినీ లోకంలో చర్చనీయాంశంగా మారింది. డిప్రెషన్ కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలినప్పటి నుంచి ఇండస్ట్రీలో నెపోటిజం (బంధు ప్రీతి)పై చర్చలు ఊపందుకున్నాయి. సినీ ఇండస్ట్రీ అనేదే ఓ మాఫియా అని ఇక్కడ ఎవరికైతే పరిచయాలు, పలుకుబడి ఉంటుందో వారికే అవకాశాలు తప్ప, టాలెంట్ పని చేయదని నటీనటులు ఓపెన్ గా అంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది మరీ ఎక్కువని అంతా పేర్కొంటున్నారు.

కోలీవుడ్‌ నటి విద్యా ప్రదీప్‌ తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సంచలన కామెంట్స్ చేసింది. సినీ రంగంలో తనకు చుక్కలు చూపించారని, చాలా టార్చర్‌కు గురయ్యానని తెలిపింది. ఇండస్ట్రీలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని, ఎలాంటి కారణం చెప్పకుండా ఆఫర్ చేసిన ఆరు చిత్రాల నుంచి తొలగించారని వాపోయింది. ఆ సమయంలో తన గుండె పగిలిపోయినంత పనయ్యిందని ఆవేదన చెందింది.

ఈ కారణంగా సినిమాలు కాదనుకొని చదువుపై దృష్టి సారించానని, సరిగ్గా ఆ సమయంలోనే 'తడం' చిత్రంలో నటించే అవకాశం రావడంతో తిరిగి సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని విద్యా ప్రదీప్ తెలిపింది. ఇండస్ట్రీలో బ్యాక్‌‌గ్రౌండ్‌ లేని వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్న ఆమె నిర్మాతలు తలచుకుంటే ఏదైనా చేస్తారని ఓపెన్‌గా చెప్పేసింది. అవళ్‌ పేర్‌ తమిళరసి సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విద్యా ప్రదీప్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఏఎల్‌ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన శైవం మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఒత్తైక్కు ఒత్త, అసుర కులం, తలైవి వంటి చిత్రాల్లో విద్య నటిస్తోంది.

Tags :
|

Advertisement