Advertisement

  • ఆ యువ నటుడుని తొక్కేయ్యాలి ..వైరల్ అవుతున్న బ్రహ్మాజీ ట్వీట్

ఆ యువ నటుడుని తొక్కేయ్యాలి ..వైరల్ అవుతున్న బ్రహ్మాజీ ట్వీట్

By: Sankar Fri, 07 Aug 2020 10:42 AM

ఆ యువ నటుడుని తొక్కేయ్యాలి ..వైరల్ అవుతున్న బ్రహ్మాజీ ట్వీట్



ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుహాస్ ..ఈ యంగ్ నటుడు కలర్ ఫోటో సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ..అయితే ఈ కలర్ ఫోటో సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ అయి అభిమానులను మాత్రమే కాకుండా టాలీవుడ్ వర్గాల వారిని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది ..ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా.. సుహాస్ సరసన తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కలర్ ఫోటో టీజర్‌ చూసిన టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఎంతో స్వీట్, ఫీల్ గుడ్‌లా ఉంది. నిర్మాత సాయి రాజేష్‌ పట్ల ఎంతో సంతోషంగా ఉంది..ఈ మొదటి చిత్రంతోనే డైరెక్టర్ సందీప్ రాజ్‌కు మంచి విజయం అందాలి. సుహాస్ ఫైర్ మీదున్నాడు. చాందినీ, సునీల్ సార్, వైవా హర్ష అందరూ సూపర్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

దీంతో వెన్నెల కిషోర్ ట్వీట్‌ చూసి మరో నటుడు బ్రహ్మాజీ వెంటనే రియాక్ట్ అయ్యారు. అన్నీ బాగున్నాయ్ కాకా.. ఈ సుహాస్‌ని తొక్కేయాలి. అతనిలో చాలా టాలెంట్ ఉంది.. లేకపోతే మనకే డేంజర్ అంటూ ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ''సుహాస్ యాక్టింగ్ సూపర్.. అలాగే బ్రహ్మాజీ కౌంటర్ అదుర్స్'' అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Tags :
|
|
|
|

Advertisement