Advertisement

  • స్క్రిప్ట్ నాకు దైవంతో సమానం ..ప్రియదర్శి

స్క్రిప్ట్ నాకు దైవంతో సమానం ..ప్రియదర్శి

By: Sankar Tue, 09 June 2020 12:06 PM

స్క్రిప్ట్ నాకు దైవంతో సమానం ..ప్రియదర్శి

జీ 5’లో ఈ లాక్‌డౌన్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ‘లూజర్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఇందులో క్రికెటర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, రైఫిల్ షూటర్ అవ్వాలి అనుకునే ముగ్గురు వ్యక్తులు.. ఆటలలో ఉండే రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలను ఎదురుకున్నారు అనే కథతో చిత్రీకరించారు.

ఇందులో ప్రియదర్శి, కల్పిక, షియాజి షిండే, శశాంక్ ముఖ్య పాత్రలలో నటించారు. లూజర్‌కు అభిలాష్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు దీన్ని నిర్మించారు. మార్చి‌లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘లూజర్’, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చాలా పెద్ద హిట్ అయింది. ఊహించని విధంగా అతి పెద్ద సక్సెస్ అందుకున్న సందర్భంగా యూనిట్ సక్సెట్‌మీట్‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ‘లూజర్’లో సూరి పాత్రలో నటించిన ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘ప్రసాద్‌గారికి కంగ్రాట్స్‌. ఇప్పుడు ఆయన ‘జీ 5’ సౌతిండియా హెడ్‌. ఇక, ‘లూజర్‌’ ప్రయాణానికి వస్తే స్ర్కిప్టే నా బైబిల్‌. అదే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పటివరకూ నేను రైఫిల్‌ షూటర్‌ క్యారెక్టర్‌ చేయలేదు. తొలుత కొంచెం భయపడినా చేశా. అభిలాష్‌, భరద్వాజ్‌, సాయి... అందరూ సిరీస్‌ బాగా రావడానికి కృషి చేశారు. ఓ 30 రోజులు రైఫిల్‌ షూటింగ్‌లో నీలకంఠగారు నాకు ట్రయినింగ్‌ ఇచ్చారు. గొప్ప బృందంతో కలిసి పని చేశా. వాళ్ల భుజాలపై నేను ప్రయాణించానని చెప్పాలి. శ్రీరామ్‌ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు. ‘లూజర్‌’ ఇంత పెద్ద విన్నర్‌ కావడం వెనుక సుప్రియ మేడమ్‌ పెద్ద పాత్ర పోషించారు. సిరీస్‌ బాగా రావడానికి సుప్రియగారు, ప్రసాద్‌గారు ఎంతో కృషి చేశారు’’ అని అన్నారు.

Tags :
|
|
|

Advertisement