Advertisement

  • మంచి ధరకు అమ్ముడుపోయిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య శాటిలైట్ హక్కులు

మంచి ధరకు అమ్ముడుపోయిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య శాటిలైట్ హక్కులు

By: Sankar Thu, 06 Aug 2020 1:00 PM

మంచి ధరకు అమ్ముడుపోయిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య శాటిలైట్ హక్కులు



టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మంచి నటులలో సత్యదేవ్ ఒకరు ..తొలుత చిన్న చిన్న కారెక్టర్లతో తన కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నారు ..కేవలం కథ బలం ఉన్న సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్న సత్యదేవ్ నుంచి వచ్చిన తాజా చిత్రం ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ..కేర్ అఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దీనికి దర్శకత్వం వహించారు ..

అయితే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. మంచి వ్యూవర్‌షిప్‌ను సాధిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందంటూ మరొకరికి చెబుతున్నారు.

ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు శాటిలైట్ రైట్స్‌కు కూడా మంచి ధర లభించింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీ సొంతం కొనుగోలు చేసింది. రూ.2.5 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ను ఈటీవీ కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంటే, మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఈటీవీలో ప్రసారమవుతుంది.

ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని, విజ‌య ప్రవీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్రభాక‌ర్ సినిమాటోగ్రఫీని అందించారు.

Tags :
|
|

Advertisement