Advertisement

  • బాలీవుడ్ యువ హీరోయిన్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ ..

బాలీవుడ్ యువ హీరోయిన్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ ..

By: Sankar Tue, 14 July 2020 11:18 AM

బాలీవుడ్ యువ హీరోయిన్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ ..



బాలీవుడ్ లో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి ..ఇప్పటికే అమిర్ ఖాన్ ఇంట్లో పని చేసే వారికీ , అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి , అనుపమ్ ఖేర్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఇలా అనేక మంది కరోనా బారిన పడగా తాజాగా యువ హీరోయిన్ సారా అలీ ఖాన్ డ్రైవర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది .. వెంటనే తనతో పాటు మిగతా కుటుంబసభ్యులకు, ఇతర సిబ్బందికి కూడా టెస్టులు జరిగాయని.. అందరికి నెగిటివ్‌గా వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సారా ఓ ప్రకటన విడుదల చేశారు.

మా డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. బీఎంసీ దీని గురించి వెంటనే అప్రమత్తమై అతడిని క్వారంటైన్‌కు తరలించింది. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, ఇతర సిబ్బందికి కరోనా నెగిటివ్‌గా తేలింది. మేమంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. నాతోపాటు నా కుటుంబ సభ్యులందరి తరఫునా బీఎంసీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మీరు కూడా జాగ్రత్తగా ఉండడి’ అంటూ సారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఇక బిగ్‌బి, అభిషేక్‌లకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు..

Tags :
|
|
|

Advertisement