Advertisement

  • కెజిఎఫ్ 2 షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న మరొక స్టార్ నటుడు

కెజిఎఫ్ 2 షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న మరొక స్టార్ నటుడు

By: Sankar Sat, 28 Nov 2020 12:18 PM

కెజిఎఫ్ 2 షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న మరొక స్టార్ నటుడు


ప్రస్తుతం భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమాలలో కేజీఎఫ్2 కూడా ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో చాలా వరకు షూటింగ్ పర్తయింది. మరి కొన్ని కీలక సన్నివేశాల కోసం ముఖ్య నటీనటులు హదరాబాద్‌ చేరుకున్నారు. వారిలో హీరో యశ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఉన్నారు.

అయితే ఈ షూటింగ్ హైదరాబాద్‌లో మరో రెండు మూడు వారాలు జరగనుంది. వచ్చే నెల చిరికి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. కన్నడంలో రూపొందుతున్న ఈ సినిమాకు తెలుగు మరియు హిందీ భాషల్లోనూ మంచి టాక్ ఉంది.

భారీ అంచనాలతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దానితో పాటుగా వచ్చే ఏడాది మొదట్లోనే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. సినిమా విడుదల థియేటర్ల ఓపెనింగ్‌ను బట్టీ ఉంటుందని అంటున్నారు

Tags :
|

Advertisement