Advertisement

  • సంజయ్ దత్ రీసెంట్ పిక్ చూసి షాకవుతున్న ఆయన అభిమానులు

సంజయ్ దత్ రీసెంట్ పిక్ చూసి షాకవుతున్న ఆయన అభిమానులు

By: Sankar Mon, 05 Oct 2020 4:26 PM

సంజయ్ దత్ రీసెంట్ పిక్ చూసి షాకవుతున్న ఆయన అభిమానులు


ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (61) ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫొటో చూసి ఫ్యాన్స్‌ షాక్ అవుతున్నారు. ఆ ఫొటోలో సంజయ్‌దత్‌ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. దీంతో సంజయ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘మున్నాభాయ్ ఎంబీబీస్’ త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.

తన ఆరోగ్యం బాగా లేదని చికిత్స నిమిత్తం కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు ఆగస్టు 11న సంజయ్ ట్వీట్ చేశారు. నాలుగో దశ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలో తొలి దశ కీమోథెరపీని పూర్తి చేసుకున్నారు. అనంతరం భార్య మాన్యతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న పిల్లలతో కొన్ని రోజులు గడిపిన సంజయ్ ఇటీవల ముంబైకి తిరిగి వచ్చారు. ఆయనకు రెండో దశ కీమోథెరపీ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

ప్రస్తుతం సంజయ్‌ దత్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కేజీఎఫ్‌ 2 సినిమాలో నటిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సంజయ్‌ సినిమా షూటింగ్‌కు కొంత విరామం ప్రకటించారు. 2020లో కేజీఎఫ్‌ సినిమా విడుదలవనుందని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి

Tags :
|

Advertisement