Advertisement

  • బాలీవుడ్ కు మరొక షాక్ ..కాన్సర్ తో బాధపడుతున్న స్టార్ హీరో

బాలీవుడ్ కు మరొక షాక్ ..కాన్సర్ తో బాధపడుతున్న స్టార్ హీరో

By: Sankar Wed, 12 Aug 2020 10:45 AM

బాలీవుడ్ కు మరొక షాక్ ..కాన్సర్ తో బాధపడుతున్న స్టార్ హీరో



తీవ్ర అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్యం గురించి షాకింగ్ న్యూస్ వచ్చింది ..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తొలుత కరోనా అని బావించినారు ..అయితే కరోనా నెగటివ్ రావడంతో మిగిలిన అన్ని రకాల పరీక్షలు చేసారు .. ఈ పరీక్షల్లో సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. అది కూడా స్టేజ్ 3లో ఉందని వైద్యులు గుర్తించారు

సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తేలినట్టు ఆయన సన్నిహితులు బాలీవుడ్ హంగామా ఛానెల్‌కు చెప్పారు. త్వరలోనే ఆయన చికిత్స నిమిత్తం యూఎస్‌కు వెళ్తారని అన్నారు. సంజయ్ ఆప్త మిత్రుడు ఒకాయన బాలీవుడ్ హంగామాతో మాట్లాడుతూ.. ‘‘బాబా కూలబడిపోయారు. ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు, వారు ప్రస్తుతం దుబాయిలో తల్లి వద్ద ఉన్నారు. కానీ, వారికి ఈ భయంకరమైన విషయాన్ని చెప్పడం ఒక అగ్ని పరీక్ష’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, సంజయ్ దత్ కూడా మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. చికిత్స నిమిత్తం తాను సినిమా షూటింగ్‌ల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన కుటుంబం, స్నేహితులు తనకు తోడుగా ఉన్నారని, తన శ్రేయోభిలాషులు ఎలాంటి కంగారు పడొద్దని ఆయన చెప్పారు. అభిమానుల ప్రేమ, దీవెనలతో త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని పేర్కొన్నారు. అయితే, తనకు క్యాన్సర్ ఉన్నట్టు మాత్రం ఆయన వెల్లడించలేదు.

Tags :
|
|
|

Advertisement