Advertisement

  • బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ పాత్రను పోషించనున్న సమంత

బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ పాత్రను పోషించనున్న సమంత

By: chandrasekar Fri, 04 Sept 2020 11:35 AM

బాలీవుడ్ లో  లేడీ ఓరియెంటెడ్ పాత్రను పోషించనున్న సమంత


సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై౦ది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకు౦ది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఇటీవల శర్వానంద్‌‌తో సమంత కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర దెబ్బతింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి జరుగాల్సీ వుంది కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇది కేవలం హారర్ చిత్రమే కాదనీ, అంతకు మించిన విషయమున్న చిత్రమని సమంత తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో ఇది రూపొందుతుంది.

మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్ తో ఓ సినిమాకు సమంత సంతకం చేసిందట. ఇందులో లేడీ ఓరియెంటెడ్ పాత్రను సమంత పోషించనుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ సినిమాతో సమంత బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక మరో వార్త ఏమంటే సమంత తన తదుపరి తెలుగు చిత్రాన్ని లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ తాజా సినిమా కన్నడ దియాకు రీమేక్‌గా వస్తోందట. కన్నడ సినిమా దియాను చూసిన సమంత ఆ రీమేక్‌లో నటించాలనీ ఉందట.

Tags :
|
|

Advertisement