Advertisement

  • సుశాంత్ మరణంతో సల్మాన్ ఖాన్ మీద చేసిన ఆరోపణలపై స్పదించిన సల్మాన్ తండ్రి

సుశాంత్ మరణంతో సల్మాన్ ఖాన్ మీద చేసిన ఆరోపణలపై స్పదించిన సల్మాన్ తండ్రి

By: Sankar Wed, 17 June 2020 6:28 PM

సుశాంత్ మరణంతో సల్మాన్ ఖాన్ మీద చేసిన ఆరోపణలపై స్పదించిన సల్మాన్ తండ్రి



యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌ల‌ను రేపుతోంది. నెపోటిజం కార‌ణంగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా విన‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్‌తో ‘ద‌బంగ్’ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అభిన‌వ్ క‌శ్య‌ప్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతుంది. స‌ల్మాన్‌ను, అత‌ని సోద‌రుల‌ను టార్గెట్ చేస్తూ అభిన‌వ్ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. త‌న‌కు సినిమాలు రానీయ‌కుండా, త‌న సినిమాల‌ను విడుద‌ల కానీయ‌కుండా స‌ల్మాన్ అత‌ని సోద‌రులు అడ్డుకున్నార‌ని అభిన‌వ్ కామెంట్స్ చేశాడు.

స‌ల్మాన్ వంటి స్టార్ హీరోపై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్త‌ల‌పై స‌ల్మాన్ తండ్రి స‌లీంఖాన్ స్పందించారు. ఒక సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటే ఆ ఆరోప‌ణ‌ల‌కు నిర్మాత మ‌ద్ద‌తు ఉండాలి. కాబ‌ట్టి ఇలాంటి ఆరోప‌ణ‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదంటూ కొట్టిపారేశారు స‌లీంఖాన్‌.

అయితే ఇంకా ఎంతో కెరీర్ ఉంది , సక్సెస్ రేట్ ఉంది , ఇలా అన్ని ఉన్న కూడా సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో , అందరూ షాక్కు గురి అయ్యారు ..ధోని సినిమాతో ఒక్కసారిగా సూపర్ స్టార్ స్టేటస్ పొందిన సుశాంత్ ఇలా అర్దాంతరంగా కన్ను మూయడం అభిమానులను కలిచివేసింది ..


Tags :
|

Advertisement