Advertisement

  • అల్లు అర్జున్‌కి చెల్లెలిగా సాయి పల్లవి..?

అల్లు అర్జున్‌కి చెల్లెలిగా సాయి పల్లవి..?

By: chandrasekar Sat, 26 Sept 2020 11:15 AM

అల్లు అర్జున్‌కి చెల్లెలిగా సాయి పల్లవి..?


'పుష్ప' స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందనల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ గురించి సినీ పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కీలక పాత్ర పోషించనుంది అని సమాచారం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలు పాత్ర పోషించడానికి డైరెక్టర్ సుకుమార్, సాయి పల్లవిని సంప్రదించాడని వినికిడి. సాయి పల్లవికి ఓకే అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలిగా సాయి పల్లవి కనిపించబోతోందన్న మాట.

ఈ సినిమా గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్న పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓ పెద్ద ట్విస్ట్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. అది బన్నీ అభిమానుల అంచనాలను మరింత పెంచుతోంది. అలాగే ఈ థ్రిల్లర్ డ్రామాలో బన్నీ రెండు వేర్వేరు షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం సాయి పల్లవి 'విరాట పర్వం' సినిమాలో రానా దగ్గుబాటికి జోడిగా కనిపించనుంది. అలాగే నాగ చైతన్య సరసన 'లవ్ స్టోరీ' సినిమాలోనూ నటిస్తోంది.

Tags :
|

Advertisement