Advertisement

  • నిహారికను అలా ఫీల్ అవుతుంటా - సాయి ధరమ్ తేజ్...!

నిహారికను అలా ఫీల్ అవుతుంటా - సాయి ధరమ్ తేజ్...!

By: Anji Wed, 16 Dec 2020 1:52 PM

నిహారికను అలా ఫీల్ అవుతుంటా - సాయి ధరమ్ తేజ్...!

ఈలలు, గోలల మధ్య సినిమా చూసే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే మాస్ ప్రేక్షకుడి మంచి శుభవార్తను అందిస్తున్నాడు సాయిధరమ్ తేజ్.

తన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ మీ కోసం థియేటర్‌లో విడుదల చేస్తున్నాం అని చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో. కరోనా పాండమిక్‌లో థియేటర్లు ఓపెన్ చేసిన శుభసందర్భంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్ధ సినిమా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు.

ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్ర విశేషాలను సాయితేజ్ పంచుకున్నారు. ఇంకా నిహారిక పెళ్లి ముచ్చట్లను కూడా చెప్పుకొచ్చారు. ఎంతైనా ఓ సినిమాను థియేటర్లో చూస్తే ఆ అనుభూతే వేరు.

ఓ జోక్ వచ్చినప్పుడు నలుగురు కలిసి నవ్వితే బావుంటుంది. పరిశ్రమ పదికాలాల పాటు నిలవాలంటే సినిమా థియేటర్లో ఆడాలి. ఇక తన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ గురించి వివరిస్తూ.. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. ఇంట్లో ఉన్న చిన్నా పెద్దా అంతా ఈ కథకు కనెక్ట్ అవుతారని అన్నారు.

నిహారిక పెళ్లి వేడుకలు ముగిశాయి కదా.. మీ పాత్ర ఏమిటి అంటే.. ఆ క్రెడిట్ అంతా వరుణ్‌దే. చాలా బాగా చేశాడు. అతిధుల్ని ఆహ్వానించడం, వాళ్లకి ఏర్పాట్లు చూడడం వంటివి చేశాను తప్ప ప్రత్యేకంగా ఏమీ చేయలేదు..

చెల్లెలి పెళ్లికి అన్న (వరుణ్) అన్నీ తానై చూసుకున్నాడు. పండుగలు, వేడుకలకు అందరం కలుసుకున్నా నిహారిక పెళ్లిలో అందరం కలసి చేసిన సందడి చాలా ఆనందాన్నిచ్చిందని అన్నారు.

నిహారికతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి వివరిస్తూ.. ఇంట్లో అంతా అన్నా చెల్లెళ్లులాగా పెరిగాం. చిన్నప్పటి నుంచి నిహారికను చెల్లెలుగా ఫీల్ అవుతుంటా. శ్రీజ, సుస్మిత అక్క.. మా అందరిదీ అక్కాతమ్ముళ్ల బంధమే.. ఇక నిహారికలో అయితే మా అమ్మ పోలికలు చాలా ఉంటాయి.

ఎంతైనా తనకి మా అమ్మ మేనత్త కదా. ఆ పోలికలు వచ్చి వుంటాయి. నిహారిక ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఇంట్లో అందరినీ సంతోషపెడుతుంది. గల గలా మాట్లాడుతుంది. చైతన్య కూడా చాలా మంచి వ్యక్తి. వాళ్లిద్దరిదీ మంచి జోడీ అని అన్నారు.

సోలో బ్రతుకే సో బెటర్ లాగా నిజ జీవితంలో కూడా సోలోగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. అయితే అమ్మ కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పా. అమ్మ నాకోసం అమ్మాయిని వెతికే పనిలో ఉంది అని అన్నారు.

ఇంటికి పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పెళ్లి చేసుకునే లోపు వాటిని పూర్తి చేయాలి. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. విజయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్వచిస్తారు.

నేను అనుకున్నది చేయగలిగానా లేదా అన్నది నాకు మాత్రమే తెలుస్తుంది. బహుశా అది చేరుకున్నాక కెరీర్ విషయంలో నేను ఇంకా సీరియస్‌గా ఉంటానేమో అని సాయిథరమ్ తేజ్ అన్నారు.

Tags :

Advertisement