Advertisement

  • డిస్ లైకు లలో పదేళ్ల రికార్డు బ్రేక్ చేసి రెండో స్థానానికి చేరిన సడక్ 2 ట్రైలర్

డిస్ లైకు లలో పదేళ్ల రికార్డు బ్రేక్ చేసి రెండో స్థానానికి చేరిన సడక్ 2 ట్రైలర్

By: Sankar Wed, 19 Aug 2020 8:31 PM

డిస్ లైకు లలో పదేళ్ల రికార్డు బ్రేక్ చేసి రెండో స్థానానికి చేరిన సడక్ 2 ట్రైలర్


సోషల్ మీడియాలో సాధ్యం కానిది ఏది లేదు అని సడక్ 2 ట్రైలర్ డిస్ లైకు లతో నిరూపితం అయింది..సుశాంత్ మరణానికి ఒక వర్గం వారే కారణం అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరగడం సడక్ 2 సినిమా మీద బాగా ఎఫెక్ట్ చూయించింది. ఎంతలా అంటే పది ఏళ్లలో ఏ ట్రైలర్ కూడా సాధించని రికార్డు సాధించేంతలా..

మరి సాధారణంగా ప్రపంచ రికార్డు సాధించడమంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. అయితే `సడక్-2` చిత్ర ట్రైలర్ సాధించిన రికార్డు మాత్రం అందుకు పూర్తిగా విభిన్నం. ప్రపంచంలోనే రెండో మోస్ట్ డిస్‌లైక్‌డ్ వీడియోగా `సడక్-2` ట్రైలర్ నిలిచింది. ఈ ట్రైల‌ర్‌ను ఇప్ప‌టివ‌ర‌కు 61 మిలియన్ల (6.1 కోట్లు) మంది వీక్షించ‌గా.. 11.65 (1.16 కోట్లు) మిలియ‌న్ల మంది డిస్‌లైక్‌లు కొట్టారు.

దీంతో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న జ‌స్టిన్ బీబ‌ర్ `బేబీ` (11.63 మిలియన్ డిస్‌లైక్స్) మూడో స్థానానికి దిగ‌జారింది. పదేళ్ల పాటు బీబర్ `బేబీ` రెండో స్థానంలో ఉండడం గమనార్హం. కాగా, ఈ జాబితాలో `యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్రీ వ‌న్ కంట్రోల్స్ రివైండ్` వీడియో 18 మిలియ‌న్ల డిస్‌లైకుల‌తో అగ్ర స్థానంలో ఉంది.

Tags :

Advertisement