Advertisement

  • సుశాంత్ మరణం ఎఫెక్ట్ : డిస్ లైక్ ల మోత మోగిస్తున్న సడక్ 2 ట్రైలర్

సుశాంత్ మరణం ఎఫెక్ట్ : డిస్ లైక్ ల మోత మోగిస్తున్న సడక్ 2 ట్రైలర్

By: Sankar Wed, 12 Aug 2020 8:13 PM

సుశాంత్ మరణం ఎఫెక్ట్ : డిస్ లైక్ ల మోత మోగిస్తున్న సడక్ 2 ట్రైలర్



బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం బాలీవుడ్ మీద గట్టిగానే పడింది ..ఎంతలా అంటే అలియా భట్ మరియు ఆమె తండ్రి మహేష్ భట్ సినిమా అయినా సడక్ 2 ట్రైలర్ రిలీజ్ అవగానే డిస్ లైక్ ల మోత మోగేంత , ఈ దెబ్బకు ఇప్పటివరకు వచ్చిన అన్ని ట్రైలర్లలో అత్యధిక డిస్ లైక్ లు వచ్చిన ట్రైలర్ గా సడక్ 2 ట్రైలర్ రికార్డు సృష్టించింది..

ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్‌లైక్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్‌ను లైక్‌ చేస్తే.. 2.5మిలయన్ల మంది డిస్‌లైక్‌ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది.

అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్‌ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. 1991లో వచ్చిన సడక్‌కు సీక్వెల్‌గా సడక్‌2 తెరకెక్కింది. దీనిలో సంజయ్‌ దత్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ..

Tags :

Advertisement