Advertisement

'తల' అజిత్ తో తలపడనున్న Rx100 హీరో

By: Sankar Wed, 15 July 2020 07:53 AM

'తల' అజిత్ తో తలపడనున్న rx100 హీరో



rx 100 సినిమాతో హీరో కార్తికేయ టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించాడు ..ఆ సినిమా తర్వాత హీరో గా నటిస్తూనే మంచి పాత్ర వస్తే విలన్ గా నటించేందుకు కూడా సై అంటున్నాడు..అలా నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రతినాయక పాత్రలో అలరించాడు..అయితే కార్తికేయ తన కెరీర్లోనే ఒక ప్రతిష్టాత్మక సినిమాలో భాగం అవుతున్న విషయాన్నీ rx 100 దర్శకుడు అజయ్ భూపతి అనుకోకుండా రివీల్ చేసేసారు ..

తమిళ్ స్టార్ హీరో అజిత్ మూవీ ‘వలిమాయి’లో విలన్‌గా నటించబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం ఇప్పుడు ఖరారైపోయింది. దీని గురించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కార్తికేయ, అజయ్ భూపతి మధ్య జరిగిన వీడియో కాన్వర్జేషన్‌లో ఈ విషయం బటయపడింది.

జూలై 13న RX 100 సినిమా రెండేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతితో హీరో కార్తికేయ సోషల్ మీడియా ద్వారా వీడియో చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి తమిళ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే, అజయ్‌ను మధ్యలోనే ఆపేశారు కార్తికేయ. ఇంకా అధికారిక ప్రకటన రాలేదని, ఆ విషయం చెప్పొద్దని కార్తికేయ రిక్వెస్ట్ చేశారు. ‘ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది కార్తి’’ అంటూ అజయ్ భూపతి బదులివ్వడంతో విషయం అర్థమైపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు కార్తికేయకు వెల్‌కమ్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Tags :
|
|
|
|

Advertisement