Advertisement

కరోనా టెస్ట్ కు ఏడ్చినా హీరోయిన్...!

By: Anji Sat, 26 Sept 2020 8:09 PM

కరోనా టెస్ట్ కు ఏడ్చినా హీరోయిన్...!

RX 100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన పాయల్ రాజ్ పుత్..మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు ఎంత కిక్ ఇవ్వాలో అంత కిక్ ఇచ్చింది ఈ భామ. ఈ భామ ఇచ్చిన కిక్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. రీసెంట్ గా వెంకిమామ , డిస్కో రాజా చిత్రాలతో ఆకట్టుకుంది. తాజాగా షూటింగ్ లకు అనుమతులు రావడం తో తన కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

అయితే షూటింగ్ స్పాట్ లో పాయల్ కి చేసిన కరోనా టెస్ట్ కి తెగ భయపడిపోయింది. ఈ సందర్భంగా పాయల్ కి కరోనా టెస్ట్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘అన్ని ముందు జాగ్రత్త చర్యలతో నా షూటింగ్ మొదలయ్యింది. అయితే కరోనా టెస్ట్ కోసం నా ముక్కు లోపల 5 సెకన్ల పాటు ఒక పరికరకంతో శుభ్రముపరిచిన విధానం మాత్రం భయంకరమైన అసౌకర్యంగా అనిపించింది.

కానీ, నేను ఆ టెస్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఏది ఏమైనా ఇది పూర్తి కావడానికి నేను నిజంగా భయపడ్డాను అంటూ వీడియో పోస్ట్ చేసింది.

Tags :
|

Advertisement